మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ చేపట్టిన నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బాబీ మీడియాతో మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నారు. సినిమా టైటిల్ వెనుక జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని కూడా డైరెక్టర్ బాబీ రివీల్ చేయడం గమనార్హం.
ఎవరైనా.. సినిమా కథ రాసాక టైటిల్ పెడతారు.. కానీ వాల్తేరు వీరయ్య కథ మాత్రం టైటిల్ ముందే అనుకొని టైటిల్ కు తగ్గట్టుగా కథ రాశానని తెలిపారు. అయితే వెంకీ మామ సినిమా సమయంలో నాజర్ గారు ఒక బుక్ ఇవ్వగా.. అందులో వీరయ్య పాత్ర తనకు బాగా నచ్చిందని అప్పట్నుంచి ఆ పేరు మైండ్ లో ఉండిపోయిందని.. మరోపక్క చిరంజీవి సినిమాలోకి వెళ్ళకముందు.. వారి నాన్నగారి స్నేహితుడు ఫోటోషూట్స్ కోసం డబ్బులు ఇచ్చారట. ఆయన పేరు కూడా వీరయ్య అని తెలిసింది . అలా వీరయ్యకు వాల్తేరు యాడ్ చేసి వాల్తేరు వీరయ్య టైటిల్ పెట్టామని తెలిపారు బాబి.
పొంగల్ ఫైట్ లో వాల్తేరు వీరయ్య ఖచ్చితంగా విజేతగా నిలుస్తాడని అంటున్నారు డైరెక్టర్ బాబి. ఇకపోతే ఈ సినిమాలో ప్రతి సీన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా ఎమోషనల్ గా కూడా అలరిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. ఇక రవితేజ కూడా పక్కా మాస్ ట్రీట్ అందివ్వబోతున్నాడు అని వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పాత్ర అత్యంత కీలకమైందని తెలిపారు. తనకైతే డైరెక్టర్ బాబీ వాల్తేరు వీరయ్య సినిమా గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.