మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. చరణ్ క్రేజ్ ను వాడుకునే ఆలొచనలో అసలు రొటీన్ కథతో తికమక స్క్రీన్ ప్లేతో తీశాడు బోయపాటి శ్రీను.
రంగస్థలం తర్వాత రాం చరణ్ సినిమా కాబట్టి సినిమాపై ఆటోమెటిక్ గా అంచనాలుంటాయి. అది బోయపాటి లాంటి ఊర మాస్ డైరక్టర్ తో సినిమా అనేసరికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అందుకే సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన వివిఆర్ ఫుల్ రన్ లో 62.64 కోట్లను రాబట్టింది.
అంటే ఎలా లేదన్నా 30 కోట్లకు ముంచేసింది వివిఆర్. నైజాం, ఉత్తారాంధ్రలో ఈ సినిమాను 32 కోట్లకు కొన్న దిల్ రాజు అక్కడ కేవలం 23 కోట్లు మాత్రమే రాబట్టాడు. అంటే దిల్ రాజుకి వివి ఆర్ 11 కోట్లు లాస్ తెచ్చిందన్నమాట. ఇక ఏరియాల వారిగా వినయ విధేయ రామ వసూళ్ల వివరాలు ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం : 12.58 కోట్లు
సీడెడ్ : 11.92 కోట్లు
ఉత్తరాంధ్ర : 8.51 కోట్లు
ఈస్ట్ : 5.42 కోట్లు
వెస్ట్ : 4.42 కోట్లు
కృష్ణ్నా : 3.69 కోట్లు
గుంటూరు : 6.36 కోట్లు
నెల్లూరు : 2.89 కోట్లు
ఏపి/తెలంగాణ : 55.79 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 5.40 కోట్లు
ఓవర్సీస్ : 1.45 కోట్లు
వరల్డ్ వైడ్ : 62.64 కోట్లు