బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో నిన్నటితో ముగిసింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ట్రోఫీని సన్నీ గెలుచుకున్నారు. సోషల్ మీడియాలో మొదటినుంచి వినిపించిన వార్తలకు ప్రకారమే మచ్చ ఈ సారి టైటిల్ ని కొట్టేశాడు. బిగ్ బాస్ ట్రోఫీని గెలిచాడు అన్న ఆనందంతో స్టేజ్ పైనే తల్లి నాగార్జున ఎత్తుకున్నాడు. అనంతరం తన తల్లి భావోద్వేగానికి లోనయ్యింది. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గెలుపు ఒక అడుగు దూరంలో ఆగిపోయాడు. ప్రేక్షకులు బిగ్ బాస్ విన్నర్ ఎవరో అవుతారా అన్న ఉత్కంఠకు తెర పడింది.
విజేత సన్నీకి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ట్రోపి ని బహూకరించాడు. 50 లక్షల రూపాయల చెక్కును అందజేశాడు. అంతేకాకుండా సువర్ణ భూమి ఇన్ ఫ్రాస్టక్చర్ నుంచి షాద్ నగర్ లో 25 లక్షలు విలువచేసే 300 చదరపు గజాల భూమిని సన్నీ గెలుచుకున్న ప్రకటించారు. అలాగే టీవీఎస్ బైక్ కూడా గెలుచుకున్నాడు అని తెలిపాడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున.అనంతరం బిగ్ బాస్ విన్నర్ సన్నీ మాట్లాడుతూ నన్ను గెలిపించిన ఆడియన్స్ కి ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అంటూ మాట ఇచ్చాడు.అలాగే మనం ఎంత కొట్టుకున్నా పెట్టుకున్నా సరే హౌస్మేట్స్ అందరం కలిసి ఉందామని తెలిపాడు సన్నీ.