టాలీవుడ్ లో యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో పాపులర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తన కెరీయర్ని కేవలం కొంతకాలం మాత్రమే నిలబెట్టుకుంది. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం బుల్లితెర పైన పెద్దగా కనిపించకపోయిన గతంలో పోవే పోరా అనే షో తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అడపా దడప చిత్రాలలో నటిస్తూనే ఉంది విష్ణు ప్రియ..
ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఈమె సినిమాలలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది విష్ణు ప్రియ. గత కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో కలిసి రెండు పాటలలో నటించింది రీసెంట్గా ఈమె తల్లి కూడా మరణించింది. కానీ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న విష్ణు ప్రియ తాజాగా తన మనసులో ఉండే విషయాన్ని సైతం బయటపెట్టింది. తనకు ఒక హీరో అంటే క్రష్ అని ఆ హీరో ఎవరో కాదు అక్కినేని అఖిల్ అని తెలియజేసింది.
ఇదే విషయాన్ని తాజాగా ఇంటర్వ్యూలో తెలియజేసినది నాకు అఖిల్ అంటే చాలా ఇష్టం వీలు కుదిరితే అతనితో ఏదో ఒక సినిమాలో నటించాలని చాలా ఆశపడుతున్నానని తెలియజేసింది.. ఒకవేళ అన్ని కుదిరితే ఆయనతో లిప్ లాక్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అంటూ బోల్డ్ కామెంట్లను చేసింది విష్ణు ప్రియ. విష్ణు ప్రియ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
దీంతో పలువురు నెటిజెన్లు విష్ణు ప్రియ అంత ఆతృతగా ఉన్నావా ఆగలేక పోతున్నావా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో నటుడు జేడి చక్రవర్తి తో వివాహానికి సిద్ధంగానే ఉన్నారని తన తల్లి ఒప్పుకుంటే చేసుకుంటానంటూ కూడా తెలియజేసింది. ఈ మధ్యకాలంలో విష్ణు ప్రియ ఎక్కువగా ఇలాంటి వ్యవహారాల పైన మాట్లాడుతోంది.