ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు చిన్న చిన్న డ్రస్సులను వేసుకొని ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా చాలాసార్లు నటీమణులను మనం ఎక్కువగా పొట్టి డ్రెస్సుల్లోనే చూస్తూ ఉంటాము. కానీ ఈ మధ్య అందాల ముద్దుగుమ్మలు పుణ్యక్షేత్రాలు దైవ కార్యక్రమాల్లో చాలా పద్ధతిగా పాల్గొంటున్నారు. మొన్నటికి మొన్న సమంత కూడా అలానే ఆధ్యాత్మికంగా కనిపించింది. ఇప్పుడు విష్ణు ప్రియ కూడా సేమ్ అలాగే కల్పించింది.
విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో మంచి ఇమేజ్ను పెంచుకుంది. యాంకర్ గా అలాగే హీరోయిన్ గా పరిచయమై మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా తను హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ఈ అమ్మడు అలాగే ఇప్పుడు కూడా ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో చూస్తే అభిమానులకు మైండ్ పోవాల్సిందే అనేలా అనిపించింది.
ఎందుకంటే అందులో తను కట్టుబొట్టు అలాగే తన డ్రెస్సింగ్ సెన్స్ అన్ని ఆధ్యాత్మికంగా కనిపించాయి. అయితే విష్ణు ప్రియ కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ చెప్పి ఆధ్యాత్మిక బాట పట్టబోతోందని తెలుస్తోంది. యూపీలోని వారణాసికి వెళ్లిన విష్ణు ప్రియ మెడలో దండతో చాలా ట్రెండీగా కనిపించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఎప్పుడు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొనే విష్ణు ప్రియ ఇప్పుడు హఠాత్తుగా డ్రెస్సెన్స్ ని మార్చేసరికి అభిమానులు షాక్ అవుతున్నారు.
ప్రస్తుతానికి ఈశా ఫౌండేషన్ లో సమంత ఎలా కనపడిందో అదే లుక్ లో విష్ణుప్రియ కూడా కనిపించింది. దీంతో విష్ణు ప్రియ సమంత ఫోటోలు ట్రెండీగా మారాయి. వీరిని చూసిన అభిమానులందరూ ఉన్నట్టుండి వీరు ఎందుకు ఇలా మారుతున్నారు అర్థం కావడం లేదు అంటూ కామెంట్సే చేస్తున్నారు. ఈ విషయం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.