కోలీవుడ్ హీరో విశాల్ అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ వీరిద్దరి ప్రేమాయణం గురించి ఇప్పటికి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి..ఇక వీరు దాదాపు 7 సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకుని పీక లోతు మునిగిపోయి.. ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు అనే విషయంపై ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఏంటో ఇప్పటివరకు తెలియజేయలేదు కానీ తాజాగా ఒక విషయం వైరల్ గా మారుతున్నది.
అయితే వీరిద్దరి బ్రేకప్ కారణం ఎవరు అని కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరికొంతమంది శరత్ కుమార్ అంటూ మరికొంతమంది వేరే కారణాలు చెబుతున్నారు. అయితే వీరి బ్రేకప్ కి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.వరలక్ష్మి శరత్ కుమార్ ,విశాల్ ఇద్దరు మడగదా రాజా అనే సినిమాలో నటించారు..ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారట .
అంతేకాకుండా వీరిద్దరి జోడి బాగుండటంతో చాలామంది ఈ జంటకి అభిమానులు అయ్యారు. అయితే వీరి ప్రేమాయణం కోలీవుడ్ మీడియా మొత్తం చాలా వైరల్ గా మారింది. విశాల్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సమయంలో 2019లో ఆర్టిస్ట్ ఎలక్షన్స్ లో శరత్ కుమార్ పోటీగా విశాల్ నిలబడ్డాడు.
అయితే ఆ సమయంలో శరత్ కూతురు విశాల్ కి మద్దతు తెలిపింది. ఇక ఆ ఎన్నికల్లో విశాల్ గెలిచాడు అయితే శరత్ కుమార్ విశాల్ తో ఓడిపోయేసరికి తన కూతురు విషయం తెలిసి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదని మీడియా వార్తలు వినిపించాయి.. అయితే ఇందులో అసలు నిజం లేదట .వీరిద్దరి బ్రేకప్ కి కారణం వరలక్ష్మి శరత్ కుమార్ ఒకవైపు విశాల్ తో ప్రేమాయణం సాగిస్తూనే మరోవైపు తమిళ స్టార్ హీరో సంతోష్ ప్రతాప్ తో సీక్రెట్ రిలేషన్ షిప్ లో ఉందట. ఈ విషయం విశాల్ కి తెలిసేసరికి వరలక్ష్మిని దూరంగా పెట్టాడని కోలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.