తమిళ నటుడు విజయ్ దళపతి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో విజయ్ 67వ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో విజయ్ ఒక కీలకమైన పాత్ర కోసం నటుడు విశాల్ ను అనుకున్నారట డైరెక్టర్. అయితే ఆఫర్ను విశాల్ తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఓ రేంజులో విజయ్ అభిమానులు విశాల్ పైన విరుచుకు పడడం జరుగుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నటుడు విశాల్ అటు కోలీవుడ్లో టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించడమే కాకుండా పలు ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు విశాల్. అయితే విజయ్ సినిమాలో అవకాశం పై విశాల్ స్పందించడం జరిగినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..విశాల్ మాట్లాడుతూ విజయ్ సినిమా ఆఫర్ ను తిరస్కరించడానికి కారణాలను సైతం తెలియజేసినట్లు తెలుస్తోంది. వీలైతే విజయ్ ను డైరెక్ట్ చేస్తానని కూడా తెలియజేశారు. విజయ్ సినిమా ఆఫర్ ను తిరస్కరించవలసి వచ్చినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవ్వడం వల్ల ఈ పని చేయవలసి వచ్చిందని తెలియజేశారు విశాల్.
అంతకుమించి మరొక కారణం ఏమీ లేదని తెలియజేశారు. భవిష్యత్తులో నాకు మరిన్ని అవకాశాలు వస్తాయి ఏదో ఒక సమయంలో విజయకు ఒక స్టోరీ నేనే సపరేటుగా రాసి చేస్తాను.. అతన్ని నేను నా దర్శకత్వంలో తెరకెక్కించాలనుకుంటున్నాను అని తెలియజేశారు విశాల్. ఇలా విజయ్ ఆఫర్ ను తిరస్కరిస్తూనే.. అతడిని డైరెక్ట్ చేయాలని కోరికను బయటపెట్టారు విశాల్. విశాల్ లోకేష్ కనకరాజు సినిమాలో హీరో పాత్రలో ఎంత బలంగా ఉంటాయి విలన్ క్యారెక్టర్ రోజు పాత్రలు కూడా అంతే బలంగా ఉంటాయని గత సినిమాలను చూస్తే మనకి అర్థమవుతుంది.
లోకేష్ కనకరాజు తెరకెక్కించిన మాస్టర్, విక్రమ్, ఖైదీ సినిమాలలో ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి, నటుడు సూర్యా , ఫహద్ ఫాజిల్ లను ఎంత అద్భుతంగా చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఒక బలమైన పాత్రని హీరో విశాల్ కు విజయ్ సినిమాలో తెలియజేయగా.. కానీ విశాల్ తిరస్కరించినట్లుగా తెలియజేశారు.