కోలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు విశాల్ తెలుగువారు అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నారు.అలాగే విశాల్ నటించిన ఎన్నో చిత్రాలు తమిళంలో నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయ్యి విడుదలవుతున్నాయి. సినిమాలలో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న విశాల్ కెరియర్ పర్సనల్ లైఫ్ లో మాత్రం అంత ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు.
ప్రస్తుతం హీరో విశాల్ కి 45 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించలేదు. గతంలో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో ఎఫైర్ ఉందని వార్తలు ఎక్కువగా వినిపించాయి. కానీ ఈ విషయం నిజం కాదంటూ తెలియజేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత అనీషా రెడ్డి అని అమ్మాయితో చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరగకగా తీరా కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక సినిమాలలో మంచి మంచి పాత్రలు చేస్తూ పేరు తెచ్చుకున్న నటి అభినయ తో విశాల్ పెళ్లి జరగబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ అందులో కూడా ఇలాంటి నిజం లేదని తేల్చి చెప్పడం జరిగింది. అయితే తాజాగా విశాల్ మరొకసారి ఒక హీరోయిన్ తో పెళ్లి పీటలు లేకపోతున్నాడు అంటు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మలయాళం తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు సంపాదించిన లక్ష్మీ మీనన్..
కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం లక్ష్మీ మీనన్ తో విశాల్ పాండ్యా నాడు, ఇంద్రుడు వంటి చిత్రాలలో నటించింది. ఇక ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగిందని ఆ సన్నిహిత్యం కాస్త ప్రేమగా మారిందని త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో కూడా త్వరలోనే వివాహం చేసుకుంటానంటూ విశాల్ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.