విశాల్ ‘ యాక్ష‌న్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… బ‌డ్జెట్ ఎక్కువ‌.. బిజినెస్ త‌క్కువ‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

స్వ‌త‌హాగా తెలుగు వాడు అయినా త‌మిళ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్‌. అటు తమిళ్‌తో పాటు ఇటు తెలుగులోనూ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్ కొద్ది రోజులుగా వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతున్నాడు. రాయుడు, డిటెక్టివ్‌, అభిమన్యుడు, పందెం కోడి 2 లాంటి హిట్స్ తర్వాత విశాల్ నుంచి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘యాక్షన్’.

రు. 55 కోట్ల‌తో విశాల్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్. ఈ సినిమాకి సుందర్ సి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడులో క‌లుపుకుంటే మొత్తం రు.29 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. వాస్త‌వంగా రు.55 కోట్ల బ‌డ్జెట్ అంటున్నారు. విజువ‌ల్స్ కూడా అదే రేంజులో ఉన్నాయి.

అయితే సినిమాకు రు.29 కోట్ల బ‌డ్జెట్ మాత్ర‌మే జ‌రిగింది. ఇక మిగిలిన అమౌంట్ అంతా సినిమా హిట్ అయితే ఆ త‌ర్వాతో లేదా శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ ద్వారానో రాబ‌ట్టుకోవాలి.. ఓవ‌రాల్‌గా సినిమాకు హైప్ ఉన్నా బ‌డ్జెట్ ఎక్కువ‌.. బిజినెస్ త‌క్కువ అన్న‌ట్టుగా ఉంది.

‘ యాక్షన్ ‘ ప్రీ రిలీజ్ బిజినెస్ :

ఆంధ్ర – తెలంగాణ – 7.2 కోట్లు (టాక్స్ అండ్ పబ్లిసిటీ కలుపుకొని)

తమిళనాడు(తమిళ్ వెర్షన్) – 17.4 కోట్లు

ఇండియా అండ్ వరల్డ్ వైడ్ – 04.2 కోట్లు
———————————————————-
తెలుగు + తమిళ్ టోటల్ బిజినెస్ – 28.8 కోట్లు
———————————————————-

Share.