యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ సినిమా యాక్షన్. కెరీర్‌లోనే ఎప్పుడూ లేనట్టుగా రు.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో నవంబర్ 15న విడుదలై డీసెంట్ టాక్ అందుకుంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో తొలి మూడు రోజుల్లోనే యాక్షన్ ఈ సినిమా 1.82 కోట్ల షేర్ ని సాధించింది.
వాస్తవంగా చూస్తే విశాల్ కి ఇది మంచి ఓపెనింగ్ కానీ బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రు 7.2 కోట్లకు అమ్ముడు పోయింది.
ఈ లెక్కన చూస్తే ఈ సినిమా ఇంకా మరో రు.5 కోట్లు షేర్ రాబడితే కాని బ్రేక్ ఈవెన్‌కు రాదు. సినిమాకు హిట్ టాక్ వస్తే వసూళ్లు మాత్రం డల్‌గానే ఉన్నాయి. ఇక విశాల్ – తమన్నా మొదటిసారి మిలిటరీ కమాండోగా కనిపించిన ఈ సినిమాకి సుందర్ సి దర్శకత్వం వహించారు. ఐశ్వర్య లక్ష్మి మరో హీరోయిన్‌గా నటించారు. ఏపీ, తెలంగాణలో యాక్షన్ 3 డేస్ వసూళ్లు ఇలా ఉన్నాయి.
ఏరియాల వారీగా 3 డేస్ ‘యాక్షన్’ కలెక్షన్స్:
నైజాం – 80.1 లక్షలు
సీడెడ్ – 28.1 లక్షలు
గుంటూరు – 12.5 లక్షలు
ఉత్తరాంధ్ర – 18.3 లక్షలు
ఈస్ట్ – 14.3 లక్షలు
వెస్ట్ – 9.9 లక్షలు
కృష్ణా – 12.5 లక్షలు
నెల్లూరు – 6.5 లక్షలు
——————————————-
3 రోజుల మొత్తం షేర్ – 1.82 కోట్లు
——————————————