పరులకు సాయం చేస్తే మంచిదేనని చాటుతున్న వీడియో.. చూస్తే ఫిదా అవుతారు!

Google+ Pinterest LinkedIn Tumblr +

మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా మంచే జరుగుతుంది అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ అనే చెప్పాలి. ఎదుటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే ఆ దేవుడి మనల్ని కూడా ఏదో ఒక రూపంలో కాపాడతాడని ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే తోటి వారికి సహాయం చేయడం వలన మనకు ఇంత మంచి జరుగుతుందా అని అనుకుంటారు. వైరల్ అయిన వీడియో ప్రకారం ఒక ప్రేమ జంట ఒక స్తంభం దగ్గర నుంచుని ఏదో గొడవ పడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కర్రతో నడుస్తున్న ఒక వృద్ధ మహిళ తన చేతిలో కూరగాయల బ్యాగ్‌ ను పట్టుకుని రోడ్డు దాటుతూ ఉండగా ఒక్కసారిగా క్రింద పడిపోతుంది. కింద పడడంతో సంచిలోని కూరగాయలన్ని చెల్లాచెదురుగా కింద పడిపోతాయి.

ఆ వృద్ధురాలికి దగ్గరలోనే ఈ జంట ఏదో గొడవ పడుతూ ఉంటారు. కాగా ఉన్నటుండి ఆ యువతి దృష్టి ఆ వృద్ధురాలిపై పడుతుంది. అలా ఆ ముసలావిడ కిందకు వంగి కూరగాయలు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా ఆమె ఆ వృద్ధురాలికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ అబ్బాయి మాత్రం ఆ యువతీ చేయి గట్టిగాపట్టుకుంటాడు. కొద్దిసేపటికి ఆ అమ్మాయి అబ్బాయి చేయి విదిలించి ఈ వృద్ధురాలికి సహాయం చేయడానికి వెళ్లి కింద పడిపోయిన కూరగాయలను సంచిలో వేస్తూ ఉంటుంది. ఇది చూసి అతను కూడా ఆ అమ్మాయికి సహకరిద్దామని అక్కడ నుండి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో అతను నుంచుని ఉన్న స్తంభం పైనుంచి ఒక పెద్ద బ్యానర్ బాక్స్ కింద పడిపోతుంది.

అదృష్టవశాత్తూ అతడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ అక్కడే నుంచుని ఉంటే మాత్రం అతని ప్రాణాలు పోయేవి. తన తప్పును తెలుసుకుని ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్లి తలపై ముద్దు పెట్టుకుంటాడు. ఈ వీడియోను ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. అలాగే మీరు ఎవరికైనా మంచి చేయండి, అందుకు ప్రతి ఫలంగా మీరు మంచి పొందుతారు’ అని క్యాప్షన్‌ రాశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఆ జంటను కాపాడడానికి దేవుడే ఆ బామ్మను పంపించాడు అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Share.