వైరల్ వీడియో: ఈ కుక్క ధైర్యం చూస్తే.. వావ్ అనాల్సిందే.. ఏకంగా సింహానికే ఝలక్ ఇచ్చిందిగా!

Google+ Pinterest LinkedIn Tumblr +

విదేశాల్లో చాలామంది తమ ఇళ్లను అడవులకు దగ్గరగానే కట్టించుకుంటారు. గ్లాస్ విండోలు, తలుపులతో ద్వారా వారు అడవి జంతువులను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి వీరికి వన్యప్రాణులతో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవి వీరు ఇంటి చుట్టూ తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఇలాంటి సమయాల్లో వాటిని ఇంట్లో నుంచే వెళ్లగొట్టడం చేస్తుంటారు ప్రజలు. అయితే తాజాగా అమెరికా దేశం, కొలరాడో రాష్ట్రం, గ్రాండ్ లేక్‌లోని ఓ ఇంటికి పర్వత సింహం వచ్చింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ ఇంటి యజమానులు తలుపులన్నీ క్లోజ్ చేసి ఇంట్లో ఉన్నారు. కానీ వారి కుక్క మాత్రం ఆ పర్వత సింహానికి ఎదురు పడింది. అయితే ఒక పెంపుడు జంతువు, ఒక క్రూర మృగం ఎదురు పడినప్పుడు చోటు చేసుకున్న దృశ్యాలను ఇంటి ఓనర్ సారా బోలే వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

 

వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఓనర్ సారా బోలే ఇంట్లో ఉండగా ఒక పర్వత సింహం కనిపించింది. దానిని చూసిన ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయింది. ఆ సమయంలో సారా శునకం డాష్ ఇంటి డోర్ వద్ద కూర్చొని బయటకు చూస్తోంది. ఆ శునకాన్ని పర్వత సింహం చూసింది. దాన్ని ఎలాగైనా చంపి తినేయాలని ముందుకు రావడం ప్రారంభించింది. కానీ కుక్క ఏ మాత్రం చలించకుండా అక్కడే ధైర్యంగా కూర్చుంది. దాంతో సింహం కూడా ఆశ్చర్య పోయినట్లు చూసింది. నన్ను చూసి కూడా ఈ కుక్క భయపడటం లేదేంటని ఆ సింహం మరింత దగ్గరకు వచ్చింది. అయితే కుక్క ఇంటి లోపల డోర్ ముందు కూర్చొని ఉంది. అందువల్ల ఈ రెండు జంతువుల మధ్య ఎలాంటి పోరు జరగకుండా ఒక గ్లాస్ అడ్డు వచ్చింది. ఈ విషయం కుక్కకి తెలియకపోవచ్చు. అయినప్పటికీ అది సింహం దగ్గరికి వచ్చినా.. ఏ మాత్రం కదలకుండా అక్కడే కూర్చుని ఉంది.

అయితే శునకాన్ని అమాంతం నోటిలోకి కరచుకుని తినేయాలని సింహం విఫల ప్రయత్నం చేసింది. కానీ అది సాధ్యపడలేదు. ఈ విషయాలన్నీ కంటి ముందే కనిపిస్తున్న ఆ కుక్క మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ దృశ్యాలను చూసిన సారా భయబ్రాంతులకు గురి అయ్యింది. వెనక్కి రావాలి అంటూ తన కుక్కను ఆమె పదేపదే పిలిచింది. కానీ సింహాన్ని చూసి ముచ్చటపడిన ఆ కుక్క బాగా ఎంజాయ్ చేసింది. గ్లాస్ అడ్డుగా ఉండడంతో కుక్క పై అటాక్ చేయడం కుదరదని తెలిసిన సింహం అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. యూట్యూబ్‌లోని స్టోరీఫుల్ రైట్స్ మానేజ్మెంట్ ఛానెల్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియోకి ఇప్పటికే దాదాపు మూడు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Share.