టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు, సాంగ్ లకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి విడుదలైన నాటు నాటు సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ పాట మార్మోగిపోతోంది. నవంబర్ 10న రిలీజ్ అయిన ఈ పాట 27 మిలియన్ లకు పైగా వ్యూస్ తో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది.
ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనితో అభిమానులు ఆ పాట స్పూఫ్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పెడుతున్నారు. ఇటీవలే ఈ పాటకు ఒక బామ్మ స్టెప్పులు వేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది.
Meanwhile :- traffic police 😂😂😅… pic.twitter.com/BAPesslAhq
— Asikhvijay (@asikhvijay) November 15, 2021
తాజాగా ఒక వ్యక్తి నడిరోడ్డుపై ట్రాఫిక్ లో నాటు నాటు సాంగ్ కి స్టెప్పులు ఇరగదీశాడు. చుట్టూ ఉన్నవారు అతని డాన్స్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫోన్ లో చిత్రీకరించారు. హెల్మెట్ కూడా తీయకుండా తన మాస్ బీట్స్ తో ఆకట్టుకున్న వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు నెటిజన్లు ఇక్కడి మాస్ డాన్స్ మామ అంటూ కామెంట్ చేస్తున్నారు.