అల్లు అర్జున్, భార్య ఇద్దరు పిల్లలు కూడా సోషల్ మీడియాలో టాప్ సెలబ్రిటీ అన్న విషయం మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. అందులో అల్లు అర్హ చేసే సందడి అందరికీ చాలా ఇష్టం. అయితే ఆయాన్ మాత్రం తక్కువగా కనిపిస్తూ ఉంటాడు. ఇక అల్లుఅర్జున్ గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఇక అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
అయితే తాజాగా ఇప్పుడు ఒక ఫోటో వైరల్ గా మారుతోంది. అందులో ఆయాన్ క్యూట్ గా నిద్రపోతున్నాడు. అల్లు అర్జున్ సెల్ఫీ ని తీశాడు. ఇందులో స్నేహ రెడ్డి మరియు అర్హ ను కూడా చూడవచ్చు. అర్హ తన తల్లి పై ముద్దుగా వాలి ఉంది. ముద్దుగా ఉన్న ఈ ఫ్యామిలీ సెల్ఫీ ఎంతో చూడముచ్చటగా ఉంది అంటే నెటిజెన్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారుతుంది. తాజాగా అల్లు అర్హ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.