శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ ఆధినేత దిల్ రాజు. దిల్ సినిమా తీయకముందు కేవలం రాజుగానే ఉండేవాడు. కాని వివి వినాయక్ దిల్ సినిమాను రూపొందించి, నిర్మాతగా రాజును తీసుకున్నారు. దీంతో రాజు కాస్త దిల్ రాజుగా మారిపోయాడు. ఈ దిల్ సినిమాతో రాజు దశే మారిపోయింది. రాజు దశ మారడంలో వినాయక్ పాత్ర కీలకం. దిల్ సినిమాతో రాజు సిని జీవితాన్ని హైస్పీడులో దూసుకుపోయేలా చేసిన వినాయక్ను హీరోను చేసి రుణం తీర్చుకోవాలని ఉబలాట పడుతున్నాడట.
దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్పై వినాయక్ ను హీరో గా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారని సిని పరిశ్రమలో వార్త హల్ ఛల్ చేస్తోంది. దిల్ రాజు విజయవంతమైన నిర్మాతగా చిత్రపరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. ఆర్థికంగా బాగా సంపాదిస్తున్నాడు. ఇప్పడు దిల్ రాజు ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. అలాంటి రాజు ఒక దర్శకుడిని హీరోగా పరిచయం చేయాలని ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉంది.
వివి వినాయక్ విజయవంతమైన సినిమాలు ఎన్నో రూపొందించారు. టాలీవుడ్ లో పెద్ద హీరోలతో అందరిని డైరెక్ట్ చేసి తన శక్తి ఏమిటో చూపాడు. చిరంజీవితో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అదే విధంగా వినాయక్ తెర వెనుక చేసే మాయతో ఎందరో నటుల జీవితాలనే మార్చేయగా, ఇప్పడు తానే తెరమీద హీరోగా కనిపించనుండటం వింతగా అనిపిస్తుంది. ఠాగూర్ సినిమాలో చిన్న పాత్ర పోషించాడు వినాయక్. ఇంకా చర్చల దశలోనే ఈ ప్రాజెక్టు ఉన్నట్లు తెలుస్తుంది. మూవీ పేరు, కథ, సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.