ఇప్పటికే చాలామంది ఒకప్పుడు స్టార్ హీరోలుగా చెలామణి అయి, తమ సెకండ్ ఇన్నింగ్స్ ను విలన్ పాత్రలతో మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ ను విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. తాజాగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్యబాబు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇకపోతే షూటింగ్ సెట్లో దర్శకుడి మాట ఆయనకు వేదవాక్కు..
తాజాగా బాలయ్య బాబు తెలుగు సినీ దర్శకులకు ఒక చాలెంజ్ విసురుతూ తన మనసులో కోరికను బయటపెట్టాడు. ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ అనే షో కి ఇటీవల అఖండ టీమ్ మొత్తం వచ్చేసరికి ఆయన ఆనందం రెట్టింపయింది. ప్రజ్ఞా జైస్వాల్ తో రెండు స్టెప్పులు వేసి , శ్రీకాంత్ తో కలిసి అదిరిపోయే డైలాగులు కూడా చెప్పాడు. ఇక తమన్ తో కాసేపు ఆట ఆడుకున్న బాలయ్య బాబు.. చివరకు విలన్ గా నటించాలని ఉంది అంటూ అసలు విషయం బయట పెట్టాడు. అయితే సుల్తాన్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన బాలయ్య ఇప్పుడు ఒక మెలిక పెట్టాడు.
విలన్ గా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ హీరో కూడా తానే అయి ఉండాలి అని చెబుతున్నాడు బాలయ్య.. ఇకపోతే బాలయ్యను విలన్ గా, హీరోగా మార్చే అంత కథను సిద్ధం చేసే సత్తా వున్న దర్శకుడు ఎవరు ఉన్నారో చూడాలి మరి.