తమిళ స్టార్ హీరో విక్రమ్ నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ సామీ స్క్వేర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సామీ చిత్రం తమిళంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా వస్తున్న సామీ స్క్వేర్ రిలీజ్కు రెడీ అయ్యింది.
విక్రమ్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే తమిళ తంబీలను ఊపేస్తున్నాయి. కాగా తాజాగా ఈ చిత్ర రన్టైమ్తో అదిరిపోయే షాక్ ఇచ్చాడు సామీ. ఈ సినిమాకు కేవలం 1 గంట 32 నిమిషాల రన్టైమ్ ఉండటంతో అందరూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోయారు. విక్రమ్ లాంటి స్టార్ హీరో సినిమా నిడివి మరీ ఇంత తక్కువేంటి అని వారు షాకవుతున్నారు. ఇక ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ను జారీ చేసింది సెన్సార్ బోర్డు.
కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ సింహా విలన్ పాత్రలో నటిస్తు్న్నాడు. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను సెప్పెంబర్ 20న రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.