సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా పేరు పొందాలని ఎంతోమంది ఆశతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. మరి కొంతమంది డైరెక్టర్గా ,నిర్మాతగా పేరు పొందాలని కూడా ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా కొత్త వాళ్లకు అవకాశం దొరకాలంటే నిర్మాత దొరకడం మరింత కష్టమని చెప్పవచ్చు. ఒకే సినిమాకు ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డాడు డైరెక్టర్ బాల. కథ సరిగ్గా ఎంచుకోవాలి ఆ కథ తగ్గట్టుగానే హీరోని సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే తాను అప్పటివరకు పడ్డ కష్టాన్ని కూడా వృధా చేయవలసి ఉంటుంది.
ముఖ్యంగా అటు నిర్మాత, హీరో, హీరోయిన్స్, యాక్టర్స్ ఇలా అందరూ కూడా సరిగ్గా సెట్ అవుతేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. లేకపోతే సినిమా ఆడడం చాలా కష్టమని చెప్పవచ్చు. కానీ డైరెక్టర్లు నమ్మి కథని అలాగే ఓకే చెబితే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఒక కొత్త డైరెక్టర్ కి సపోర్ట్ దొరకడం చాలా కష్టం. ఇక బాల సేతు సినిమా చేయాలనుకున్నప్పుడు ఆయనకు ఇప్పటివరకు చెప్పిన అన్ని కష్టాలు అనుభవించారట. మొదటి సినిమా 1997 షూటింగ్ మొదలయ్యిందట. ఇక అప్పటి నుంచి ఎన్నో ఆటంకాలు మొదలయ్యాయని సమాచారం.
చిన్న బడ్జెట్ తో సేతు సినిమాని మొదలుపెట్టారు షూటింగ్ కోసం ఉదయాన్నే పూజ చేసి మొదలుపెట్టగా ఏవో కారణాల చేత సాయంత్రం షూటింగ్ ఆగిపోయిందట .ముఖ్యంగా ప్రొడ్యూసర్ లేకపోవడం ఆ కథకు చాలా మందికి వినిపించారు బాల. అయితే ఎవరూ చేయడానికి ముందుకు రాలేకపోవడంతో బాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా కంద స్వామి ముందుకు వచ్చారు. కథ కూడా వినకుండా ఓకే చెప్పి సినిమా మొదలుపెట్టాక పెప్సీ యూనియన్ స్ట్రైక్ వల్ల షూటింగ్ ఆగిపోయింది స్ట్రైక్ అయ్యాక ప్రొడ్యూసర్ సినిమాని ఆపేశారు. దీంతో విక్రమ్ ,బాల, బాల అసిస్టెంట్ అమీర్ సుల్తాన్ వెళ్లి కంద స్వామిని బ్రతిమలాడి 1998లో సినిమాను పూర్తి చేశారట. ఇక విక్రమ్ తన భార్య ఇచ్చిన డబ్బుతోనే ఈ సినిమాని ప్రమోట్ చేశారట.