టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా లో బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలో హీరోగా చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల తరువాత మహేష్ బాబు, టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెలుగు సినిమా రూపొందనుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక విషయం గురించి ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కు హీరో విక్రమ్ ను చేయాలని పరిశీలిస్తోందట చిత్రబృందం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి. ఇక మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా జనవరి 13న విడుదల చేయాల్సి ఉండగా, సంక్రాంతి పండుగకు భారీ చిత్రాలు విడుదల అవుతుండటంతో, ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ కానుకగా ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు చిత్రబృందం. ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు.