ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్స్ వివాహాలు చాలా సీక్రెట్ గా జరుగుతున్నాయి. వివాహానికి వారం ఉందనగా, వారి యొక్క వివాహం విషయాలు బయటకు వస్తున్నాయి. అలా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి గురించి కూడా చాలా ఆలస్యంగా విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ పెళ్లి కి వచ్చేవారికి పెడుతున్న కండిషన్స్ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి.
డిసెంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు కత్రినా విక్కీ పెళ్లి వేడుకలు జరుగుతాయని టాక్ వినిపిస్తోంది. రాజస్థాన్ లో వీరి వివాహ వేడుకను సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇక ఇదే నేపథ్యంలో వీరి పెళ్లికి హాజరయ్యే అతిథులకు కొన్ని కండిషన్స్ పెట్టారట. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
1. మా పెళ్లి వివరాలను ఎవరికీ చెప్పకూడదు
2. ఫొటోలు, సెల్ఫీలకు అనుమతి లేదు
3. పెళ్లికి సంబంధించి ఎలాంటి వివరాలు సోషల్ మీడియా షేర్ చేయకూడదు
4. వెడ్డింగ్ లొకేషన్ వివరాలు కూడా ఎవరికీ చెప్పకూడదు
5. వివాహ వేదిక వద్దకు వచ్చాక… బయటి వాళ్లతో కాంటాక్ట్‌లో ఉండకూడదు
6. వెడ్డింగ్ ప్లానర్స్ అనుమతి తీసుకున్న తర్వాతే ఆ ఫొటోలు షేర్ చేయొచ్చు
7. వివాహ వేదిక వద్ద ఎలాంటి రీల్స్, స్టోరీస్ చేయకూడదు.
ఈ విషయాలు ఇప్పుడు ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి.