టాలీవుడ్ సీనియర్ నటుడు, మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈయన పెద్ద కుమారుడు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం ఎయిర్ ఫోర్ట్‌కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌ఫోర్ట్‌లో మోహన్‌బాబుకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మోహన్‌బాబు మాట్లాడారు. విజయవాడ కు రావడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.
తన ఆత్మీయులను, స్నేహితులను కలిసేందుకు విజయవాడకు వచ్చానని తెలిపారు. ఆ తరువాత ఎయిర్‌పోర్టు నుంచి పెదపారుపూడి మండలం వానపాముల గ్రామానికి మోహన్ బాబు బయల్దేరి వెళ్లారు.ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందటంతో ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు మోహన్‌బాబు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన తరువాత ఏపీ సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నట్టు సమాచారం. ఇవాళ మోహన్‌బాబు విజయవాడకు రావడంతో చూడడానికి పలువురు అభిమానులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున వెళ్ళు పడ్డారు.