విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న ‘నోటా’

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ నోటా ‘, ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఆద్యంతం రాజకీయాల చుట్టూనే నడవనుందని అర్ధం అవుతుంది. ఈ సినిమా ద్వారా విజయ్ మరో సారి ఒక పవర్ ఫుల్ రోల్ లో అభిమానులకి దర్శనమివ్వనున్నారు. ఇక నిన్న విడుదలైన ట్రైలర్ చిత్రం పై అంచనాలు మరింత పెంచింది. కేవలం కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. అయితే అప్పుడే ఈ సినిమాని కొన్ని వివాదాలు వెంటాడుతున్నాయ్. ఈ సినిమా ఒకేసారి తెలుగు మరియు తమిళం లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

ఇక్కడే అసలు వివాదం మొదలైంది తమిళ్‌లో నోటా ట్రైలర్ రిలీజ్ పోస్టర్‌ ను అదే భాషలో ముద్రించిన చిత్ర బృందం, తెలుగు టైటిల్‌ను మాత్రం ఇంగ్లీషులో ముద్రించింది. అయితే తమిళ పోస్టర్ ని వారి భాషలో వేసి, తెలుగు పోస్టర్ ని మాత్రం ఇంగ్లీష్ లో ముద్రించటంతో కొంత మంది తెలుగు అంటే చులకన అని ఈ సినిమా పై విరుచుకు పడ్డారు. ఈ వివాదం పై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు ఎటువంటి సమాధానం చెప్పలేదు. చూద్దాం ఈ వివాదం ఎంతటి వరకు వెళ్తుందో.

 

Share.