విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరో. ఇటీవలే ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న విజయ్ ఆ అవార్డు ని వేలం వేసి సి ఎం రిలీఫ్ ఫండ్ కి అందచేశారు.దీనితో విజయ్ క్రేజ్ తెలంగాణ రాష్ట్రము లో బాగా పెరిగింది. ఇప్పుడు రీసెంట్ గా రౌడీ వేర్ అని ఒక సొంత రెడీ మేడ్ వస్త్ర వ్యాపారం లోకి ప్రవేశించారు విజయ్.
ఇక ఇప్పుడు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ లో ‘గీత గోవిందం’ అనే ఒక ప్రేమ కథ చిత్రం లో నటిస్తున్నారు ఈ యువ కథానాయకుడు. తొలి సారి రష్మిక మందాన విజయ్ కి జోడిగా నటించారు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా బన్నీ వాస్ నిర్మాత వ్యవహరించారు.
ఈ రోజు చిత్ర బృందం ఈ సినిమా అఫిషియల్ టీజర్ ని విడుదల చేయగా దానికి మంచి స్పందన వస్తుంది. టీజర్ చూడగా ఇది ఒక రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం అని తెలుస్తుంది. రష్మిక, విజయ్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులని అలరించనున్నాయి. ఇక ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 29 న నిర్వహిస్తామని నిర్మాత తెలుపగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఆగష్టు 15 వ తేదీన విడుదలకి సిద్ధం గా ఉంది.