తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పటి హీరోయిన్లలో విజయశాంతి కూడా ఒకరు.. ఈమె అప్పట్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రను వేసుకుంది. విజయశాంతి పుట్టింది వరంగల్ ఈ అమ్మడు పెరిగింది మద్రాస్ చిన్నతనం నుంచే బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తరువాత తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ సరసన కిలాడి కృష్ణుడు సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
అయితే ప్రారంభంలోనే గ్లామర్ పాత్రలకే పరిమితమైన విజయశాంతి టీ. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నేటి భారతం ప్రతిఘటన సినిమాలతో మరో హీరోయిన్ తనను టచ్ చేయలేని స్థాయికి వెళ్లిపోయింది. నేటి భారతం చూసిన వారందరూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాకే ఆమెకు ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది.
జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం సినిమా విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడీ స్ఫూర్తితో మోహన్ గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అపూర్వ విజయాన్ని సాధించి ఆమెకి మంచి ఘనతలు తెచ్చి పెట్టింది. అంతేకాకుండా ఈ సినిమాకి నంది అవార్డు అలాగే ఉత్తమ జాతీయ అవార్డు కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన పోలీస్ లాకప్ తర్వాత రెండేళ్ల పాటు రాలేదు.
అంతేకాకుండా 1996 లో నుంచి ఒక్క సినిమా కూడా నటించలేదు.. విజయశాంతినీ కొందరు దర్శకులు నిర్మాతలు, సెలబ్రిటీలు ఇక నీకు సినిమాలు ఎందుకు? నీ పని అయిపోయింది ఇంట్లో కూర్చొ అని గోరంగా అవమానించారట .అంతకుముందు అవకాశాలు ఇచ్చిన వారు కూడా ఆమె వైపు కన్నెత్తి చూడలేదు. అయితే అదే టైంలోనే దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఒసేయ్ రాములమ్మ అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా మార్చి 7న 1997లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ ఏడాది తెలుగు స్టార్ హీరోలు నటించిన సినిమాల రికార్డులను ఒసేయ్ రాములమ్మ బ్రేక్ చేసింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. తనను అవమానించిన వారందరూ ముక్కు మీద వేలు వేసుకునేలా చేసింది.