టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ విజయశాంతి. సినీ ఇండస్ట్రీలోకి ఎవరి అండ లేకుండా హీరోయిన్ గా ఎదిగింది. మొట్టమొదటిసారిగా టాలీవుడ్ లోని కోటి రూపాయలు అందుకున్న అలనాటి హీరోయిన్లలో మొదటి స్థానం సంపాదించింది. విజయశాంతి అప్పట్లో ఎంతో మంది హీరోలతో సమానంగా పలు సినిమాలలో నటించి స్టార్ స్టేటస్ ను అందుకుంది. అప్పట్లో విజయశాంతి సినిమా విడుదలవుతుందంటే చాలు కొంతమంది స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకునే వారట ఆ రేంజ్ లో విజయశాంతికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.
ఇక హీరోలకు ఏమాత్రం తీసుకోకుండా పలు యాక్షన్ సన్నివేశాలు నటిస్తూ ఉండేది. అందుచేతనే ఈమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. అయితే విజయశాంతి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆమె మీద అప్పట్లో పలు రకాలుగా రూమర్లు వినిపిస్తూ ఉండేవీ .ముఖ్యంగా అలనాటి హీరో సురేష్ తో ఎఫైర్ ఉన్నట్లుగా కూడా బాగా రూమర్స్ వినిపించాయి. సురేష్ అప్పటికి హీరోగా మంచి స్థాయిలో ఉండేవారుట. అయితే ఈ రూమర్లు ఎందుకు వచ్చాయో తెలియదు కానీ విజయశాంతి వర్గం నుంచి ఈ రూమర్లు ఎక్కువగా వినిపించాయని సమాచారం.
దీంతో ఈ విషయం తెలిసిన సురేష్ కు విజయశాంతితో మాట్లాడడం మానేశారట .ఈ వార్తలు పై విజయశాంతి కూడా ఎక్కడ కూడా స్పందించలేదని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత 12 సంవత్సరాలకు వీరిద్దరూ కలిసి ఒక సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయని ఈ విషయాన్ని హీరో సురేష్ ఆలీతో సరదాగా వచ్చిన ప్రోగ్రాంలో తెలియజేసినట్లు తెలుస్తోంది.