తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. అయితే ఈ చిత్రం విడుదలై ఇప్పటికి ఏడాది పైనే కావోస్తున్న తన తదుపరి చిత్రానికి సంబంధించి ఎలాంటి పనులు మొదలు కాలేదు. కేవలం డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ సినిమా ఉంటుందని ఒక అప్డేట్ తప్ప మరే విధంగా కూడా సినిమా షూటింగులు మొదలు పెట్టలేదు.
ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ సమస్య గా ఉందనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో విజయశాంతిని తీసుకోబోతున్నారనే వార్తలు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ కు తల్లి పాత్రలో ఇమే నటించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం కొరటాల శివ, విజయశాంతిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందులోని క్యారెక్టర్ కూడా సరికొత్తగా ఉండడంతో విజయశాంతి కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కోసం విజయశాంతిని తల్లిగా చూపించడంతో ఈ సినిమాకి మరింత బజ్ ఏర్పడిందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. పైగా బాలీవుడ్ లో కూడా ఈమెకు బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్. RRR చిత్రంతో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు సంపాదించారు. అందుచేతనే జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్, విజయశాంతి ఇలా మొత్తంగా ఏ రకంగా చూసుకున్న ఈ సినిమాకి కాస్త ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. మరి ఈ కాంబినేషన్ ని సెట్ చేస్తారా లేదా అనే విషయంపై చిత్రబంధం క్లారిటీ ఇవ్వవలసి ఉంది.
ఎన్టీఆర్ ,కొరటాల శివ సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయింది .ఈ భజ్ కు తగ్గట్టుగానే ఖర్చుని పెట్టబోతున్నారు యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ వారు. ఈ చిత్రంలో ఒక హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. RRR సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.