రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 26న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్ అన్ని ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక రిలీజ్ ముందు సినిమాకు మరింత క్రేజ్ వచ్చేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. పెళ్లిచూపులు సినిమా నుండి టాక్సీవాలా వరకు ద్వారకా క్రేజ్ రాకముందు సినిమా కాబట్టి లైట్ తీసుకున్న విజయ్ కి నోటా పెద్ద షాక్ ఇచ్చింది.
అందుకే ఆ సినిమా రిజల్ట్ రిపీట్ అవ్వకుండా ఎంతో కష్ట పడి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా పరిశ్రమలో ఒక్క ఫ్లాప్ తో ఫేట్ మారిపోతుంది అందుకే డియర్ కామ్రేడ్ విషయంలో విజయ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. డియర్ కామ్రేడ్ మాత్రమే కాదు తెలుగు, తమిళ భాషల్లో ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో వస్తున్న హీరో సినిమాకు విజయ్ కొన్ని సూచనలు ఇచ్చాడట. యూత్ లో తనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా స్క్రీన్ ప్లే ఉండేలా చూసుకుంటున్నాడు విజయ్.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా ఎదిగిన విజయ్ ఇలానే కష్టపడితే స్టార్ స్టేటస్ లో కొనసాగుతాడని మాత్రం చెప్పొచ్చు.