విజ‌య్ ‘ విజిల్ ‘ 4 డేస్ క‌లెక్ష‌న్స్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన బిగిల్ (తెలుగులో విజిల్‌) సినిమా ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రో కోలీవుడ్ హీరో కార్తీ న‌టించిన ఖైదీ సినిమాకు పోటీగా వ‌చ్చిన విజిల్ తెలుగులో మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఇక తొలి నాలుగు రోజుల‌కు విజిల్ ఏపీ, తెలంగాణ‌లో రు 7.75 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

ఈ సినిమాను తెలుగులో ఈస్ట్‌కోస్ట్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ కోనేరు రిలీజ్ చేశారు. విజ‌య్ మాసివ్ పెర్పామెన్స్‌, న‌య‌న‌తారతో పాటు నిర్మాణ విలువ‌లు.. అట్లీ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఇవ‌న్నీ విజిల్‌కు ప్ల‌స్ అయ్యాయి. ఇక ఓవ‌రాల్‌గా రు.180 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేసేందుకు రు.10 కోట్లు చెల్లించారు. ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికి విజిల్ లాభాల భాట ప‌ట్టేయ‌నుంది.

విజిల్ 4 డేస్ ఏపీ, తెలంగాణ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి… (రూ.కోట్ల‌లో) :

నైజాం – 2.35

సీడెడ్ – 2.05

వైజాగ్ – 0.78

గుంటూరు – 0.87

ఈస్ట్ – 0.50

వెస్ట్ – 0.36

కృష్ణా – 0.50

నెల్లూరు – 0.34
——————————-
ఏపీ + తెలంగాణ = 7.75
——————————-

Share.