ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు హీరో విజయ్ శంకర్?

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ శంకర్ హీరోగా, జి సూర్య తేజ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో ఆషు రెడ్డి హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే ఇందులో సీనియర్ నటి సుహాసిని ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది.స్కైరా క్రియేషన్స్ సమర్పణలో, రిలాక్స్ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఫోకస్ అనే ఒక డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా హత్యానేరం నేపథ్యంలో సాగే కథగా తెరకెక్కబోతోంది. ఇప్పటివరకూ ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు తెరకెక్కించిన అప్పటికీ ఇది వాటికి కాస్త భిన్నంగా ఉంటుంది అని దర్శకుడు తెలిపారు.

ఇందులో సుహాసిని మణిరత్నం ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఇందులో భాను చందర్, షియాజీ షిండే, జీవా, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మర్డర్ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ లను ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది, అలాగే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు, విశేషాల గురించి త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు సూర్య తేజ తెలిపారు.

Share.