ఈ రౌడీ హీరో కొత్త తలనొప్పులు తెస్తున్నాడా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వరుస వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం తెలుగు వెండితెర మీద విజయ్ ప్రస్థానం కొనసాగుతోంది. పెళ్లి చూపులు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆ తరువాత ‘డిఫరెంట్ యాంగిల్ లో యూత్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన ‘ అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ తనను తాను నిరూపించుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హోదా సంపాదించుకున్న హీరో విజయ్ ఇప్పుడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ‘డియర్ కామ్రేడ్’ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

విజయ్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ‘డియర్ కామ్రేడ్’ సినిమాను నాలుగు భాషల్లో తీస్తున్నారు. విజయ్ కెరియర్ లో మొదటిసారిగా ఇన్ని భాషల్లో రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి. టాలీవుడ్లో కేవలం కొందరు స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయిన మల్టీ లాంగ్వేజ్ లోకి విజయ్ ఇంత తక్కువ సమయంలోనే రీచ్ కావడం గొప్ప విషయమే. అయితే ఈ సినిమా ప్రమెషన్స్ కోసం విజయ్ దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు.

ఇక్కడే విజయ్ తన ప్రత్యేకతను చాటుకునేలా తనదైన శైలిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ స్వయంగా ఆడి, పాడి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ఆ సినిమాకు ఎక్కడలేని ప్రమోషన్ వచ్చేస్తోంది. ప్రస్తుతం విజయ్ సాగిస్తున్న ఈ ట్రెండ్ ప్రస్తుత టాలీవుడ్ యంగ్ హీరోలకు తలనొప్పిగా మారింది. విజయ్ సాగిస్తున్న ఈ తరహా ప్రమోషన్స్ వర్కవుట్ అవుతుండడంతో రేపు మిగతా హీరోలను కూడా ఇదే విధంగా చేయాలనే ఒత్తిడి నిర్మాతలు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఈ వ్యవహారం అంత చూస్తుంటే మిగితా హీరోలకి విజయ్ లేని పోనీ తల నొప్పులు తీసుకు వచ్చే లా ఉన్నాడని తెలుస్తుంది.

Share.