తమిళ నటుడు ఏడాదికి డజన్ కు పైగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వివిధ భాషల సినిమాలతో వస్తున్న విజయ్ సేతుపతిని పాన్ ఇండియా స్టార్ అంటూ పిలుస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించాడు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి ఇటీవల ఒక సందర్భంలో నన్ను కొందరు పాన్ ఇండియా స్టార్ అంటూ పిలుస్తున్నారు. నేను కేవలం నటుడిని మాత్రమే పిలిచండి.. పాన్ ఇండియా హీరోని కాదు. పలు భాషలలో నటిస్తే… పాన్ ఇండియా స్టార్ అవుతారా అలా అందరూ పిలుస్తూ ఉంటే అసౌకర్యంగా అనిపిస్తోంది అంటూ విజయ్ సేతుపతి తెలిపారు.
నేను అన్ని భాషల్లో నటించాలి అనుకునే సగటు నటుడిని… నన్ను పాన్ ఇండియా నటుడు అనటం నచ్చటం లేదు అన్నాడు. పాన్ ఇండియా నటుడు అంటూ నన్ను పిలిస్తే ఒత్తిడికి గురి అవుతున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. సినిమాల్లో నటించడం అనేది తన డ్యూటీ.. ఒకవేళ భవిష్యత్తులో పంజాబీ, మరాఠీ, గుజరాతి మరియు బెంగాలీ భాషలలో నటించేందుకు అవకాశం వస్తే అందులో కూడా నటిస్తానని విజయ్ సేతుపతి తెలిపారు. అది ఏ భాష అయినా ప్రేక్షకులను అలరించే విధంగా నటించాలి అనుకుంటే కచ్చితంగా నటిస్తాను.
అయినా కూడా తాను పాన్ ఇండియా నటుడిని కాదు సాధారణ నటుడినే అంటూ తెలుపుకొచ్చారు.. నటుడు అనే పదానికి ఎలాంటి ట్యాగ్స్ తగిలించటం ఇష్టం లేదని పేర్కొన్నాడు. విజయ్ సేతుపతి తమిళంలో ఎంతో పేరు సంపాదించుకున్న హీరో.. అలాంటి ఆయనని పొగిడే అవకాశం వచ్చినా కూడా ఆయన అందుకు ఒప్పుకోవటం లేదు. వారు చెప్పే మాటలను చూస్తుంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అవకాశము వస్తే ఎవరూ వదులుకోరు. కానీ విజయ్ సేతుపతి మాత్రం నేను పాన్ ఇండియా హీరోని కాదు సగటు నటుడిని అని అంటున్నారు.