అనతి కాలంలోనే అందరికి అందనంత ఎత్తుకు ఎదిగిన హీరోయిన్.. అందంలోనూ, నటనలోనూ బాగానే ఉంటుంది. అందుకే ఆమే నటన అంటే అభిమానులు బాగా ఫిదా అవుతారు.. ఆమే నటించింది అంటే సినిమాకు భారీగానే హైప్ క్రియోటు అవుతుంది. కానీ ఎందుకో ఈ మద్య కాలంలో ఆమే నటించిన సినిమాలు హిట్ కావడం లేదనిట. అందుకే ఇప్పుడు ఆ అమ్మడిపైన టాలీవుడ్‌లో ప్లాప్‌ల హీరోయిన్ అని ముద్ర పడింది.
అయితే ఇప్పుడు ఆ ప్లాప్‌ల హీరోయిన్‌కు మాత్రం రౌడీహీరో దేవరకొండ విజయ్ పై మనస్సు పారేసుకుందట. అందుకే ఆయనతో నటించాలని ఉందట. విజయ్ దేవరకొండే ఇప్పటికే ప్లాప్ లతో సతమవుతుంటే ఇప్పుడు ఓ ప్లాప్‌ల హీరోయిన్ ఆయనతో నటించాలని కోరుకోవడం చూస్తుంటే గంతకు తగ్గ బొంత అనిపించుకుంటుంది. ఇంతకు ఈ రౌడీహీరోతో నటించాలనుకుంటున్న ఆ ప్లాప్‌ల హీరోయిన్ ఎవ్వరు అనుకుంటున్నారా.. అయితే మీరే చూడండి…
టాలీవుడ్‌లో తన అందంతో, నటనతో అలరించే నటి రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఇటీవల ఆమే నటిస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్‌లు అవుతున్నాయి. దీంతో ఆమేకు అవకాశాలు రావడం లేదని టాక్ వినిపిస్తుండగా, ఇప్పుడు ఆమే తనకు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని అంటుంది. సో విజయ్ దేవరకొండపై ఈ భామ మనస్సు పారేసుకుందన్నమాట..