ఎన్టీఆర్ ను భయపెడుతున్న విజయ్ దేవరకొండ

Google+ Pinterest LinkedIn Tumblr +
త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా వస్తున్న అరవింద సమేత కొబ్బరికాయ కొట్టినరోజే దసరాకి రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అయితే లాంగ్ వీకెండ్.. ఫెస్టివల్ హాలీడేస్ ఉన్నాయి కాబట్టి దసరాకి చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. ఎన్.టి.ఆర్ కు పోటీగా కష్టమే అయినా ఈసారి తారక్ తో ఢీ కొట్టేందుకు విజయ్ దేవరకొండ, రవితేజలతో పాటుగా కోలీవుడ్ హీరో విశాల్ కూడా రెడీ అవుతున్నాడు.
అక్టోబర్ 11న అరవింద సమేత వస్తుండగా 4న విజయ్ నోటా రిలీజ్ అంటున్నారు. అదే రోజుకి అటు ఇటుగా రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ వస్తుందట. ఇక ఇదే కాకుండా విశాల్ పందెం కోడి 2 అక్టోబర్ 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. చూస్తుంటే ఈసారి ఎన్.టి.ఆర్ కు గట్టి పోటీ తగిలేలా ఉంది.
ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతున్నా ఎన్.టి.ఆర్ అరవింద సమేత 100 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. అయితే పోటీగా రంగంలోకి చాలా సినిమాలు దిగడం కలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక విజయ్ విసిరినా ఈ ఛాలెంజ్ లో గెలుపెవరిదో తెలియాలంటే దసరా వరకు వెయిట్ చేయక తప్పదు.
Share.