నైజాంలో స్టార్లకు తీసిపోని విజయ్ రేంజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +
విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం 100 కోట్ల గ్రాస్.. 60 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా.. కేవలం ఒక్క నైజాం ఏరియాలోనే 19 కోట్ల షేర్ వసూళు చేసింది. నైజాంలో విజయ్ క్రేజ్ కు నిదర్శనం ఇది. పరశురాం డైరక్షన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమాలో విజయ్ సరసన రశ్మిక మందన్న నటించింది. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మించారు.
నైజాంలో ఈ సినిమా 20 కోట్లకు ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఈ రేంజ్ కలక్షన్స్ స్టార్ హీరోలకు మాత్రమే వస్తాయి. తెలంగాణా బిడ్డ కాబట్టి విజయ్ కు నైజాంలో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. కేవలం నైజాం ఏరియాలో 20 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు చాలా తక్కువ. 19 కోట్ల మార్క్ రీచ్ అయినవి ఉన్నాయి. వాటి సరసన విజయ్ గీతా గోవిందం చేరింది.
మరో మూడు రోజుల్లో చైతు సినిమా వస్తుంది. చూస్తుంటే ఈ వీకెండ్ కల్లా నైజాంలో గీతా గోవిందం 20 కోట్లు వసూళు చేసి స్టార్ హీరోలు నెలకొల్పని రికార్డ్ నమోదు చేసుకునే అవకాశం ఉంది.
Share.