టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా రౌడీ హీరోగా గుర్తింపు పొందాడు విజయ్ దేవరకొండ. వరుసగా అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు, గీతగోవిందం సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. దీంతో ఒక్కసారిగా యూత్లో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోవడంతో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కి ముఖ్యంగా ఫిదా అయిపోయారు నేటిజన్స్. ఇలాంటి నేపథ్యంలోనే పాన్ ఇండియా లెవెల్ లో నటించిన లైగర్ సినిమా ఘోరమైన ప్లాపును చవిచూసింది ఈ సినిమా డిజాస్టర్ అయిన సినిమా కొన్న బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయారు.
ఈ విషయంలో డైరెక్టర్ పూరి ,డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పెద్దవార్ జరిగిందని చెప్పవచ్చు. ఇంత హంగామా అవ్వడంతో లైగర్ టీం సైలెంట్ గా మారిపోయింది. విజయ్ దేవరకొండ కూడా ఇదివరకు మాదిరి ఎక్కడా కూడా తన యాక్టివ్గా కనిపించలేదు. కొన్నాలుగా ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతులకు కేవలం ఖుషి సినిమా మాత్రమే ఉన్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వంలో రాబోతోంది ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తున్నది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమయంలో షూటింగ్ వాయిదా వేయవలసి వచ్చింది.
వచ్చే నెల ఆఖరికి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు… ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ దాదాపుగా రూ.40 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం ఈ సినిమా సీతా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు దీంతో విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.