విజయ్ దేవరకొండ ‘నోటా’ థియేట్రికల్ ట్రైలర్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘ నోటా ‘, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కొన్ని నిమిషాల క్రితం విడుదల చేసారు చిత్ర యూనిట్ బృందం. ఈ సినిమాలో విజయ్ ఒక వ్యసనపరుడి నుండి రాష్ట్ర సి ఎం ఎలా అయ్యాడనేది ప్రధాన కథాంశం. నటి మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. గీత గోవిందం సక్సెస్ తర్వాత విజయ్ నటించిన ఈ చిరం పై భారీ అంచనాలు నెలకొన్నాయ్. గీత గోవిందం సుమారు రూ 100 కోట్లు కలెక్ట్ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు ‘ నోటా ‘ చిత్రాన్ని దర్శకుడు ఆనంద్ శంకర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటులు నాజర్, సత్య రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల మీద నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో వేచి చూడాలి. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఈ సినిమాని జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

 

Share.