టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెతో కలిసి నటించాలని యంగ్ హీరోలే కాదు సీనియర్ హీరోలు కూడా క్యూ కడుతున్న విషయం తెలిసిందే. అలాంటి సమయంలో సాయి పల్లవిని తన సినిమాలో వద్దు అని చెప్పి విజయ్ దేవరకొండ ఆమెను అవమానపరిచారు అంటూ ఒక వార్త గుప్పుమన్నది. ఇక అసలు విషయంలోకి వెళితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కెరియర్ మొదట్లోనే పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించి.. ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు.
పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి అనంతరం పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ స్మార్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది . ఇక అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుని తనలో ఉన్న మరో యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ముఖ్యంగా ఇందులో మాస్ డైలాగ్స్ తో పాటు బోల్డ్ సన్నివేశాలలో నటించి అమ్మాయిలకు కలల రాకుమారుడిగా మారిపోయారు. సినిమాల ప్రమోషన్స్ విషయంలో పెద్ద ఎత్తున ఆటిట్యూడ్ చూపిస్తూ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఇటీవల వచ్చిన ఖుషి సినిమాలో మ్యాన్లీ గా కనిపించి మరొకసారి అలరించారు.
ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పరుశురాం దర్శకత్వంలో మరొక సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే గౌతమ్ సినిమాలో ఈయన సరసన శ్రీ లీల నటిస్తూ ఉండగా.. పరుశురాం దర్శకత్వంలో మృనాల్ నటించబోతున్నారు. అయితే ఇక్కడ మొదటి ఛాయిస్ సాయి పల్లవి అని తెలుస్తోంది. అయితే సాయి పల్లవి చాలా డెడికేటెడ్ గా ఉంటుంది బోల్డ్ సన్నివేశాలకు అస్సలు ఒప్పుకోదు. అలాంటి ఆమెతో పనిచేయడం తనకు కష్టం అని విజయ్ దేవరకొండ చెప్పడం వల్లే సాయి పల్లవిని కాదని మృణాల్ ని తీసుకున్నట్లు సమాచారం.