పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా ఇలా వరుస విజయాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ కాస్త గ్యాప్ తీసుకొని ‘డీయర్ కామ్రెడ్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గీతాగోవిందం లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా వచ్చి ఎంత మంచి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. మరోసారి ఈ జంట తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘డీయర్ కామ్రెడ్’కి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ నిర్మిస్తోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన టీజర్, లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాస్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో రష్మిక స్టేట్ క్రికెట్ ప్లేయర్..అయితే ఆమెను గొప్ప పొజీషన్ లోకి తీసుకు రావడానికి విజయ్ దేవరకొండ ఎన్నో కష్టాలు పడుతున్నట్లు కనిపిస్తుంది.
తన ప్రేమను త్యాగం చేసి కొంత కాలం కనిపించకుండా వెళ్లి తిరిగి వచ్చి తన ప్రేమకు దక్కించుకుంటాడా..లేదా అన్ని విషయం తెరపై చూడాల్సిందే. ఈ మూవీలో మరోసారి విజయ్ దేవరకొండ, రష్మిక కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయినట్లు కనిపిస్తుంది. చివరిగా ‘నన్ను భయపెడుతున్నారనుకుంటున్నారేమో..మీరు భయపడుతున్నారు’ అనే పవర్ ఫుల్ డైలాగ్ చూస్తుంటే ఈ మూవీపై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే నెల 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్నది.