నందమూరి బాల కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్’ ఇది స్వయంగా స్వర్గియా శ్రీ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో బాల కృష్ణ తన తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ సినిమాకి దర్శకుడిగా పని చేయనున్నారని ఇటీవలే చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రని బాలీవుడ్ నటి ‘విద్య బాలన్’ చేయనున్నారని ఇటీవలే ప్రకటించారు. బాల కృష్ణ స్వయంగా ముంబై కి వెళ్లి మరి విద్య బాలన్ ని ఎన్టీఆర్ సినిమాలో నటించవలసిందిగా కోరారట.
ఇక ఈ రోజు మధ్యాహ్నం విద్య బాలన్ హైదరాబాద్ వచ్చి తన షూటింగ్ ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారట. అందులో భాగంగా ఇవాళ బాల కృష్ణ గారి ఇంటికి వెళ్లగా ఎన్టీఆర్ పెద్ద కుమార్తె అయిన లోకేశ్వరి విద్య బాలన్ ని తెలుగు వారి సంప్రదాయం ప్రకారం ఒక మంచి చీర బహుకరించారు. అయితే విద్య ఇవాళ కనిపించిన లుక్ లోనే సినిమాలో కూడా కనిపిస్తుందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
రేపటి నుండి విద్య బాలన్ రామోజీ ఫిలిం సిటీ లో జరిగే షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.