చిరంజీవి పాటకు ఊపేస్తున్న హెబ్బా పటేల్ వీడియో వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ల హవా బాగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తమకు సంబంధించిన ఎలాంటి వాటినైనా సరే షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఇక కొంతమంది హీరోయిన్లు మాత్రం పలు చిత్రాలకు సంబంధించి పాటలను రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నుంచి బాస్ పార్టీ అనే సాంగ్కు డాన్స్ చేసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వచ్చే సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ బాలయ్య అన్నట్లుగా కొనసాగుతోంది. చిరంజీవి నటిస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. చిరంజీవి చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా బాలకృష్ణ సినిమాకి తమన్ అందిస్తున్నారు. చిరంజీవి సినిమా నుంచి బాస్ పార్టీ అనే పాట బాగా వైరల్ గా మారుతొంది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు బాస్ పార్టీ అనే పాట ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా హీరోయిన్ హెగ్బా పటేల్ సైతం తన షూటింగ్ గ్యాప్ లో బాస్ పార్టీ అంటూ మాస్ స్టెప్పులతో అదరగొట్టేస్తోంది.

ప్రస్తుతం ఇప్పుడు హెబ్బా పటేల్ మంచి జోరు మీద కనిపిస్తోంది వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండడమే కాకుండా పలు ఓటీటిలో, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. హెబ్బా పటేల్ నటించిన చిత్రం ఓదెల రైల్వే స్టేషన్ అందరినీ బాగా ఆకట్టుకుంది.ఇందులో ఇమే నటన లుక్స్ మించి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది ప్రస్తుతం హెబ్బా పటేల్ డాన్స్ కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

బాస్ పార్టీ అంటూ చిరు స్టైల్ స్టెప్పులు వేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక చిరంజీవి,ఊర్వశి రౌతెలా స్టైల్ లో హెబ్బా పటేల్ వేసిన డ్యాన్స్ నెత్తిన వైరల్ గా మారుతొంది. ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Share.