సమంత తన భర్త నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నో విశేషాలను తెలుపుతూ.. కంటతడి పెట్టుకుంది.. సమంత మాట్లాడుతూ.. చైతూ తో నేను విడాకులు తీసుకుంటున్నానని ప్రకటించిన తర్వాత చాలామంది రకరకాల కామెంట్లు పెట్టారు.. అయితే వాటన్నింటినీ ఎదుర్కొని నేను ఇంత ధైర్యంగా నిలబడతానని ఎప్పుడూ భావించలేదు.. చైతూని దూరం చేసుకోలేక విడాకుల తర్వాత చనిపోవాలని అనుకున్నాను..
కానీ సమస్యలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ.. ఎంతో బలంగా ,దృఢంగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఆమె తెలిపింది.. ఈ సంవత్సరం నా వ్యక్తిగత కారణాల వలన నాకు ఎంతో క్లిష్టంగా గడిచింది అని ఆమె తెలిపింది.. ఇక నాగ చైతన్యతో నేను కష్టపడి నిర్మించుకున్న నా కలలన్నీ.. జీవితాంతం ఆయనతో ఎలా ఉండాలి.. ఏమేం చేయాలి అన్న కోరికలు , కలలు అన్ని కూడా విడాకులు అనే పదంతో శిథిలమై పోయాయి అంటూ.. ఆ సమయంలో ఆ బాధ ఎలా వుంటుందో నాకు మాత్రమే తెలుసు అంటూ తీవ్రంగా దుఃఖించింది. ఈ సంవత్సరం నాకు చాలా దారుణంగా గడిచింది కాబట్టి .. వచ్చే సంవత్సరం ఎలాంటి ఆశలు పెట్టుకోను.. కాలం ఎలా ముందుకు తీసుకుని వెళ్తే అలా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటానని సమంత తెలిపింది.