తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాంగోపాల్ ఎప్పుడు కూడా నిత్యం ఏదో ఒక వార్తలలో నిలుస్తూ ఉంటారు. వర్మ తాను ఏం మాట్లాడిన అవతలి వారు ఫీల్ అవుతారనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరు.. తను ఏం చెప్పాలనుకునే విషయాన్ని మొహమాటం లేకుండా చెబుతూ ఉంటారు. సంచలనాలకు మాత్రమే కాదు సంచలన వ్యాఖ్యలను చేస్తూ ఉంటారు. కేవలం మాటలు మాత్రమే కాకుండా తనకు నచ్చిన పని చేయడంలో కూడా వర్మకు ఒక సపరేట్ స్టైల్ ఉందని చెప్పవచ్చు.
ఇక తన నిజ జీవితంలో మాత్రం ఎవరితో ప్రేమలో పడ్డాడు అనే విషయానికి వస్తే.. అందరూ కూడా శ్రీదేవితో అని చెబుతూ ఉంటారు.. ఇక వర్మ శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని ఆమెను ఎంతగానో ప్రేమించానని కానీ ఆమె మాత్రం బోనీ కపూర్ ను వివాహం చేసుకుందనే విషయాన్ని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. అంతేకాకుండా అతను తన పాలిట విలన్ అంటూ కూడా తెలియజేస్తూ ఉంటారు వర్మ. అయితే వర్మ ,శ్రీదేవితో పాటు కొన్నేళ్లు ఊర్మిళను కూడా ప్రేమించారట. అంతేకాకుండా ఆమెను కొన్నేళ్లపాటు సినీ ఇండస్ట్రీలో నడిపించాలని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇద్దరు హీరోయిన్స్ కన్నా ముందు సత్య అనే అమ్మాయితో కొన్నేళ్లపాటు వర్మ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెపై ఇష్టంతోనే తాను తీసిన ఒక చిత్రానికి సత్య అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఊర్మిళ నాగార్జున కాంబినేషన్లో వచ్చిన అంతం అనే సినిమాను తీశారు వర్మ. ఇది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అలాగే ఊర్మిలపై ఇష్టంతో అలాగే తన లవర్ పేరు పెట్టి ఒక స్టోరీని కాస్త అటు ఇటు తిప్పి సత్య అంటూ సినిమా తీశారు. ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది.. ఒకవేళ అంతం సినిమా సక్సెస్ అయ్యి ఉంటే సత్య సినిమా తీసేవాడిని కాదంటూ వర్మ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.