ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సెలబ్రిటీల జాతకం గురించి తెలియజేస్తూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ప్రభాస్ జాతకం గురించి గతంలో తెలియజేస్తే షాకింగ్ విషయాలను తెలిపారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ జాతకం గురించి అడగగా అందులో పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. వేణు స్వామి మాట్లాడుతూ కేవలం నేను ముహూర్తాలు మాత్రమే పెడతానని ఎయిర్పోర్టుకు వెళితే ప్రోటోకాల్ ఉంటుందని తెలిపారు..
500 రూపాయలు ఇస్తే హైదరాబాదులో ఎవరికైనా ప్రోటోకాల్ ఇస్తారని తెలిపారు ఆయన. తనకు ఏపీ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇస్తుందని వేణు స్వామి కామెంట్లు చేయడం జరిగింది. తన దగ్గర ఉండాలని నేను విమానాశ్రయానికి 45 నిమిషాల ముందుగా వెళతానని తెలిపారు ప్రతి హీరో, హీరోయిన్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ వారిని వేణు స్వామి తెలిపారు. కరోన విజృంభించిన తర్వాత తమ పక్క ఎవరు కూర్చోకుండా సీట్లు బుకింగ్ చేసుకుంటున్నారని తెలిపారు వేణు స్వామి.
అలాగే 2027 -2028 లో టాలీవుడ్ ప్రముఖ హీరో హీరోయిన్ కు ప్రాణగండం ఉందని తెలిపారు. అయితే వాళ్లు ఎవరనే విషయం మాత్రం చెప్పలేదు. సమంత చైతన్య కలిసే ఛాన్స్ లేదని కూడా తెలిపారు. ప్రభాస్ గారి పరిస్థితి నెగటివ్ గా ఉందని ఆయన ఆరోగ్య ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని ఆయనకు అర్ధాష్టమ శని ప్రారంభం కానుందని తెలిపారు వేణు స్వామి. ప్రభాస్ చేసిన సినిమాలు మరి బారి హిట్ కావని తెలిపారు. ఇక రానా గురించి సమాజానికి తెలియక ముందే నేను చెప్పానని తెలిపారు వైసీపీలో 25 మందికి టికెట్లు రావని కూడా తెలిపారు.