స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాహుబలి సినిమా తర్వాత సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. ప్రభాస్ సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కానీ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేయడం జరిగింది. సినిమా ఫ్లాప్ అయిన హిట్ అయిన ప్రభాస్ తో సినిమాలు తీయడానికి మాత్రం దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే తాజాగా ప్రభాస్ జాతకం గురించి ప్రముఖ ఆస్ట్రాలజీ వేణు స్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
సలార్, కల్కి చిత్రాలతో బాక్సాఫీసును షేక్ చేస్తారని నమ్మకాన్ని కలిగిస్తున్న ప్రభాస్ కాని జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని వేణు స్వామి తెలియజేస్తున్నారు ప్రభాస్ కి పెళ్లి విషయం కూడా లేట్ అవుతుందని పెళ్లి చేసుకున్న ఎన్నో సమస్యలు వస్తాయని వేణు స్వామి కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ జాతకంలో ఒక పాము దోషము ఉందని ఆ పాము వల్ల ప్రభాస్ కు మంచి పేరు అయితే వస్తుంది కానీ.. ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదని తెలియజేశారు.
ప్రభాస్ పెళ్లి లేట్ అవుతుందని పెళ్లి చేసుకున్న పర్సనల్ లైఫ్ లో సమస్యలు వస్తాయని వేణు స్వామి తెలియజేశారు.. ప్రభాస్ ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఉందని కూడా వేణు స్వామి తెలియజేశారు.
ఇండస్ట్రీలో ప్రభాస్ ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించే అవకాశం అయితే లేదని కూడా లేదని వేణు స్వామి తన అభిప్రాయంగా తెలియజేయడం జరిగింది. ప్రభాస్ విషయంలో వేణు స్వామి చెప్పిన విషయం నిజమవుతుందో లేదో చూడాలి మరి.
ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి వంటి చిత్రాలలో నటిస్తున్నారు. ఈ చిత్రాలన్నీ కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రభాస్ క్రెజ్ ఈ మధ్యకాలంలో తరచూ పెరిగిపోతూనే ఉంది. ఈ ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాలి మరి.