ప్రముఖ ఆస్ట్రాలజ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినీ ప్రముఖుల, రాజకీయాల నాయకుల జ్యోతిష్యం చెబుతూ మంచి పేరు సంపాదించుకున్నారు.. గతంలో ఈయన చెప్పిన మాటలు నిజమవడంతో ఈయన చెప్పే మాటలు నమ్మే వారి సంఖ్య రోజుకి ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. ఇక వేణు స్వామి చేత ఇప్పటికే ఎంతమంది సెలబ్రెటీల సైతం వారి కెరియర్ కోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేయించుకున్నారు. తాజాగా వేణు స్వామి ఒక ఇంటర్వ్యూల పాల్గొంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వేణు స్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయాల గురించి పలు విషయాలను తెలియజేయడం జరిగింది. మనదేశంలో ఎన్నో ఆలయాలలో స్వామివారికి మద్యం మాంసం నైవేద్యంగా పెడుతున్నారని తెలియజేయడం జరుగుతోంది .అలాగే బ్రాహ్మణులు కూడా తింటున్నారని తెలియజేశారు. అయితే తాను ఆచార వ్యవహారాలను నియమనిష్టలతో పాటించే బ్రహ్మచారుల గురించి మాట్లాడడం లేదని దొంగ చాటుగా బ్రాహ్మణులు అని ముసుగు వేసుకొని లోపల మద్యం, మాంసం తినేవారి గురించే మాట్లాడుతున్నానని తెలిపారు.
నేను కూడా దొంగ చాటుగా మద్యం తాగుతానని మాంసం కూడా తింటారని వేణు స్వామి తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే నేను వీటిని బయట చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను ఎందుకు చెప్పానంటే నేను ఒక భోగిని అంటే.. అనుభవించే వాడిని ఇలా చేయడం తప్పు కాదని కూడా తెలియజేశారు వేణు స్వామి. తాను ఎక్కడికి వెళ్తే అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి పద్ధతులను కూడా మార్చుకుంటూ ఉంటానని తెలిపారు వేణు స్వామి.. ఇలా ఈయన మద్యం తాగుతూ మాంసం తింటారని చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారుతోంది.