హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సెలబ్రిటీల భవిష్యత్తుకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. వారి మీద ప్రత్యేకమైన పూజలు చేయడంతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు వేణు స్వామి.. ఇక గతంలో అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటారనే విషయాన్ని తెలియజేసి బాగా ఫేమస్ అయ్యారు దీంతో వీరిద్దరూ విడిపోవడం కూడా జరిగింది. వీరి పెళ్లికి ముందే వివాహేతర సంబంధం గురించి కూడా వీణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Nidhhi Agerwal: Heroine Nidhi Agarwal Worships Venus At Home. Video Viral

ఆ తర్వాత ఎంతమంది సెలబ్రెటీల జాతకాలను చెబుతూ వారి జీవితంలో జరిగే అటువంటి కొన్ని సంఘటనల గురించి తెలియజేస్తూ ఉంటారు వేణు స్వామి. వేణు స్వామి జాతకాలుకు మాత్రమే కాకుండా సెలబ్రిటీల కోసం కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూనే ఉంటారు.గతంలో హీరోయిన్ రష్మిక వేణు స్వామితో ప్రత్యేకమైన పూజలు చేయించింది. ఇప్పుడు తాజాగా వీరి జాబితాలోకి హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా చేరినట్లు తెలుస్తోంది.

నిధి అగర్వాల్ కూడా ఇంట్లో రాజా శ్యామల పూజ నిర్వహించినట్లు కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.. ఈ మేరకు వేణు స్వామితో నిధి అగర్వాల్ ఉన్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. ఈ వీడియోలలో నిధి అగర్వాల్ పింక్ కలర్ చుడీదార్ ధరించి ఉన్నది.ఇక వేణు స్వామి బృందం చెబుతున్నట్లుగా ఆమె వేదమంత్రాలు చదువుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది గతంలో రష్మిక కూడా వేణు స్వామితో పూజ చేయించింది ప్రస్తుతం వేణు స్వామి పై సాధారణ ప్రజలకే కాకుండా సినీ సెలబ్రిటీలలో కూడా బాగా నమ్మకం పెరిగిపోతుంది.

ఆయన వ్యాఖ్యలను కొంతమంది మాత్రం కొట్టి పారేస్తుంటే సెలబ్రిటీలు మాత్రం వేణు స్వామితో ప్రత్యేకమైన పూజలు చేయించుకొని బాగా పాపులర్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ మొదట సవ్యసాచి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

Share.