సినిమాలలో రాజకీయాలలో వారసుల ఎంట్రీ కామన్ గా మారిపోయింది.ఒక వ్యక్తి హీరోగా నిలబడ్డారంటే ఆ తర్వాత అతడి కుటుంబంలో కూడా మరి కొంతమంది సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇక హీరోలు తమ పిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అలా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానుల లిస్టులలో ముందు వరుసలో ఉన్నది బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ.
బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ వెండితెర మీద చూడడం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని టాక్ చాలా రోజుల నుంచి వినిపిస్తూనే ఉంది.. కానీ ఇంకా మొదలు కావడం లేదు .అయితే మోక్షజ్ఞ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రం పక్కా అన్నట్లుగా అందుకు సంబంధించి ముహూర్తం కూడా ఇంకా సెట్ కాలేదని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సెలబ్రెటీల భవిష్యత్తు గురించి జ్యోతిష్యం చెబుతూ పెను సంచలనంగా మారారు జ్యోతిష్యుడు వేణు స్వామి.
అయితే తాజాగా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ కెరియర్ పైన పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు కానీ ఆలస్యంగా వస్తారు అయితే లేటుగా వచ్చిన సరే తిరుగులేని స్టార్ గా ఎదుగుతారు.. సినీ రంగంలో మోక్షజ్ఞకు మంచి భవిష్యత్తు ఉందని అభిమానులను అలరించి స్టార్ హీరోగా ఎదుగుతారని తెలియజేశారు. పొలిటికల్ ఎంట్రీ విషయానికి వస్తే మోక్షజ్ఞ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడని సినిమాలే తనకు క్రేజీ తెచ్చి పెట్టేలా చేస్తాయని వేణు స్వామి కామెంట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.