వెంకీ కీ పారితోషికం వద్దట..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వెటరన్ హీరో కుర్రహీరోలతో పోటీ పడుతున్నాడు… కుర్రహీరోల వేసే స్టెప్పులకు తానేమీ తక్కువ కాను అని నిరూపిస్తున్న ఈ వెటరన్ హీరో పారితోషికం విషయంలోను మీకంటే నేనమన్నా తక్కువ తిన్నానా అంటూ హుంకరిస్తున్నాడు… ఇంతకు ఆ వెటరన్ ఎవరనే కదా మీ అనుమానం ఇంకెవరండీ మన విక్టరీ వెంకటేశ్ గారేనండి…

అసలు విషయం ఏమంటే ఈయన గారు ఇకముందు నటించబోయే సినిమాలకు పారితోషికం తీసుకోరట… పారితోషికం తీసుకోవద్దని ఈ హీరో గారి అన్నగారైన దగ్గుబాటి సురేష్ గారు ఖరాకండిగా చెపుతున్నారనే వార్త సిని వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మన నిర్మాతల దగ్గర హీరోగారు పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా నటిస్తారని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే… పారితోషికం తీసుకోకుండా మన హీరోగారు పుక్కిటికి నటించడానికేమైనా దానకర్ణుడు అనుకుంటున్నారా…! అబ్బే అదేం కాదండి ఇకముందు పారితోషికంకు బదులు లాభాల్లో వాటాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు మరి…

వెంకటేష్ ఎఫ్2 సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కుర్రహీర్ వరుణ్తేజ్తో పోటీ పడి మరి నటించిన వెంకటేష్ అభిమానులను అలరించాడు. అంతే కాదు ఎఫ్2 సినిమా 80కోట్లకు పైగా వసూలు చేసిందట మరి.. ఇంకేముంది వెంకటేష్ కూడా భారీ షేర్లను రాబడుతున్న తరుణంలో ఇదే మంచి అదనుగా ఒక్కో సినిమాకు ఇంత పారితోషికం అని తీసుకోకుండా వచ్చే లాభంలో వాటా తీసుకుంటే బాగుంటుందని ఆలోచించాడట. ఇంకేముంది వెంకటేష్ అన్నగారు సురేష్బాబు వెంకటేష్ ఇకముందు పారితోషికం తీసుకోడు… కేవలం వాటాలే తీసుకుంటాడని ప్రకటించేశాడట… అదేనండి సుమా దీపముండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలి అనే సామెతను వెంకటేష్ నిజం చేస్తున్నాడండి… మరి వెంకటేష్ నిర్ణయం నిర్మాతలకు వరంగా మారుతుందో… శాపంగా మారుతుందో వేచిచూడాల్సిందే మరి.

Share.