ఫన్నీగా ‘వెంకిమామ’ టైటిల్!

Google+ Pinterest LinkedIn Tumblr +

జూనియర్ ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’మూవీ తర్వాత దర్శకుడు బాబీ చాలా గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య మల్టీస్టారర్ మూవీ ‘వెంకి మామ’రూపొందుతోంది. ఈ ఇద్దరి పాత్రలను బాబీ చాలా వైవిధ్యభరితంగా మలిచాడట. ఆ మద్య హీరోయిన్ల విషయంలో కొద్దిగా కాంట్రవర్సీ వచ్చినా..ఫైనల్ గా వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పూత్, నాగ చైతన్య సరసన రాశీఖన్నా ఫిక్స్ చేశారట.

ఇటీవలే రాజమండ్రిలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 8వ తేదీ నుంచి ప్లాన్ చేశారు. రేపు ఉగాది పండుగ సందర్భంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఇక టైటిల్ విషయానికి వస్తే చాలా ఫన్నీగా ఉంది.

రాశి చక్రంలో ‘వెంకీ’ అనేది ఆంగ్ల అక్షరాలతో .. ‘మామ’ అనేది తెలుగు అక్షరాల్లో డిజైన్ చేశారు. పోస్టర్లో ఒక వైపున పల్లెటూరు .. మరో వైపున యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పూర్తి వినోదభరితంగా రూపొందుతోన్న ఈ సినిమా మరో ఎఫ్ 2 లేవెల్ లోకి వెళ్తుందా చూడాలి. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటారు.

Share.