టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కుటుంబం దగ్గుపాటి కుటుంబం..ఈ ఇంటి వారసుడైన వెంకటేష్ పలు కుటుంబ కథ చిత్రాలలో నటించి ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వెంకటేష్ వృత్తి పరమైన జీవితం కాకుండా వ్యక్తిగత విషయానికి వస్తే..
వెంకటేష్ కు నలుగురు సంతానం అందులో ఒక ముగ్గురు కూతుర్లు.. ఒక కొడుకు.. వారిలో ఒక అమ్మాయికి పెళ్లి చేశాడు.. ఇప్పుడు రెండో అమ్మాయికి ఈ మధ్యనే నిశ్చితార్థం కూడా జరిపించిన సంగతి మనకు తెలిసిందే..వెంకటేష్ కాబోయే అల్లుడు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేష్ కి కాబోయే అల్లుడు విజయవాడకు చెందిన వ్యక్తి ఇక ఆయన పేరు ఆకాష్ ఆయన వృత్తి రీత్యా డాక్టర్
ఆకాష్ మాత్రమే డాక్టర్ కాదు వారి కుటుంబం మొత్తం వృత్తిరీత్యా డాక్టర్..వీరికి విజయవాడలో హాస్పిటల్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.ఇక పోతే వెంకటేష్ కి కాబోయే అల్లుడు దేశంలోనే టాప్-10 గైనకాలజిస్టులో ఒకరని తెలిసింది.ఈయన తన వైద్య వృత్తిలో ఎంత పేరు ప్రఖ్యాతలను సంపాదించుకొని టాప్ టెన్ డాక్టర్స్ లో ఒకరిగా స్థిరపడ్డారు. ఈయన సంపాదన కూడా నెలకు కోట్లలోనే ఉంటుందని తెలుస్తోంది.ఏది ఏమైనా కూతురి జీవితం గురించి ఆలోచించి వెంకటేష్ భారీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబానికి తన కూతుర్ని కూడలిగా పంపుతున్నాడు.
ఇక వెంకటేష్ తండ్రిగా తన బాధ్యతలను కరెక్ట్ గా నిర్వహిస్తున్నాడు. ఏదేమైనా వెంకటేష్ వారికి దగ్గర అల్లుడినే సెలెక్ట్ చేశారని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హయవాహిని, ఆకాష్ నిశ్చితార్థానికి సినీ ఇండస్ట్రీ స్టార్ హీరోలందరూ కదలి వచ్చారు. ఈ ఏడాది వెంకటేష్ కూతురు వివాహం ఉండబోతుందని సమాచారం.